డిఫెరెంట్ కాన్సెప్ట్ తో “ది బేకర్ అండ్ ది బ్యూటీ” ట్రైలర్!

Published on Sep 6, 2021 5:43 pm IST

ఆహా వీడియో ఒరిజినల్స్ రూపొందిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ ది బేకర్ అండ్ ది బ్యూటీ. ఈ వెబ్ సిరీస్ పై ఆహా వీడియో గత కొద్ది రోజులుగా ప్రమోషన్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీరీస్ లో నటిస్తున్న పలువురు పాత్రలను పరిచయం చేసిన టీమ్, తాజాగా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ ట్రైలర్ లో హీరో ఇద్దరు అమ్మాయిల తో లవ్ లో ఉంటాడు. ఒకరిని విడిచిన తర్వాత మరొకరితో ప్రేమ, ఆపై వచ్చే పరిణామాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేయడం, ఎదురైనా అనుభవాలు అన్ని కూడా ఈ సీరీస్ లో ఫన్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ లో లాస్ట్ లో వచ్చే డైలాగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. జిందగీ లో ఒకటి యాద్ పెట్టుకో తమ్ముడు, పోరి ఎంత కిరాక్ ఉన్నదనుకొ, అన్ని కష్టాలోస్తాయి. ఈ సీరీస్ లో సంతోష్ శోభన్, టిన శిల్పా రాజ్, విష్ణు ప్రియ, వెంకట్, సాయి శ్వేత, ఝాన్సి, సంగీత శోభన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జొనాథన్ ఎడ్వర్డ్స్ ఇందుకు దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :