ట్రైలర్ లో పునర్జన్మల కాన్సెప్ట్ బాగానే హైలెట్ అయింది !

Suvarna Sundari

సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా “సువర్ణసుందరి”. పునర్జన్మల నేపధ్యంలో రానున్న ఈ చిత్రం నుండి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రైలర్ లో ప్రధానంగా పునర్జన్మల కాన్సెప్ట్ తో పాటు శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని అర్ధమవుతుంది. అలాగే ట్రైలర్ లోని గ్రాఫిక్స్ కూడా బాగానే ఆకట్టుకుంది.

ఇక సాయి కార్తీక్ సంగీతం కూడా ట్రైలర్ కి బాగా ప్లస్ అయింది. మొత్తానికి చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో రాబోతున్న ఈ చిత్రంలో కూడా మంచి విజువల్స్ ఉన్నాయి. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version