ప్రపంచ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ వెబ్ సిరీస్ నే స్ట్రేంజర్ థింగ్స్. ఒక చెరగని ముద్ర వేసుకున్న ఈ క్రేజీ అడ్వెంచర్ సిరీస్ ఫైనల్ చాప్టర్ గత 2025లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మొత్తం మూడు భాగాలుగా దీనిని విభజించి తీసుకొచ్చారు. ఇక చివరి భాగంగా కేవలం సింగిల్ ఎపిసోడ్ ని కొత్త సంవత్సరం కానుకగా స్ట్రీమింగ్ తీసుకొచ్చారు నెట్ ఫ్లిక్స్ వారు.
మొత్తం 2 గంటల 8 నిమిషాల సింగిల్ ఎపిసోడ్ ని మేకర్స్ ఇప్పుడు ప్రపంచ భాషల్లో తీసుకొచ్చేశారు. దీనితో ఈ బిగ్గెస్ట్ ట్రీట్ సిరీస్ ముగిసిపోయింది. సో ఈ ఎపిసోడ్ ని చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఈ సిరీస్ ని డఫర్ బ్రదర్స్ దర్శకత్వం వహించగా మిల్లీ బాబీ, నోవాః స్క్నాప్, జేమీ కాంప్ బెల్ బోవెర్ ,ఫిన్ వోల్ఫ్ హార్డ్, డేవిడ్ హార్బర్, గెటెన్ మటరాజో, కాలెబ్ మెక్లాంగ్లిన్, జో కెరీ, తదితరులు నటించారు.
