విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ ఫస్ట్ లుక్ !
Published on Jul 12, 2018 1:00 am IST

యువ హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం’వీర భోగ వసంత రాయలు’. నూతన దర్శకుడు ఇంద్రసేన. ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్య పాత్రలో నటిస్తుంది. బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత అప్పారావు బెల్ల‌న మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటివరకు ఎవ్వరు చూడని విధంగా ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ప్రొడ్యూసర్ గా వచ్చా అనేకంటే నేను ప్రొడ్యూసరుగా మారాను అనడం కరెక్ట్. ఈ ప్రపంచం మీదికి మా అమ్మానాన్న పంపిస్తే నన్ను నిర్మాతగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డాక్టర్ ఎం వి కె రెడ్డి గారు. ఈయనే నాకు బ్యాక్ బోన్. సౌత్ ఆఫ్రికా, అమెరికా లో ఉన్న డాక్టర్ మాధవి డాక్టర్ నిరంజన్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. ఇంద్ర ఎన్ని అవాంతరాలు వచ్చినా సినిమాను చాలా చక్కగా పూర్తి చేశాడు. మా హీరోలంతా నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. సినిమా ఇంత భాగా రావడనికి కారకులైన మా టెక్నిషియన్స్ అందరికి చాలా థాంక్స్. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన.ఆర్ మాట్లాడుతూ నారా రోహిత్, విష్ణు గారికి చాలా థాంక్స్ నాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. అలాగే సుదీర్ బాబు గారికి శ్రీయ గారికి కూడా చాలా థాంక్స్. అప్పు సపోర్ట్ మర్చిపోలేను. చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న గుడిలో బ్రహ్మంగారి చరిత్ర రోజు వినేవాడిని. అందులో ‘వీరభోగ వసంత రాయలు’గురించి విన్నాను. అది ఎందుకో నా మనసులో స్థిరంగా నాటుకుపోయింది. నేను ముందు స్టోరీ రాసుకున్నాను. ఆ తరవాత వీరభోగ వసంతరాయలు టైటిల్ కి కథకి బాగా కుదిరింది. సినిమాకు ఇదే బ్యాక్ బోన్ పాయింట్. పాపాలు పెరిగాయి… దాని చుట్టూనే కథ తిరుగుతుంది. అందరికీ ఫస్ట్ లుక్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అని అందరికి ధన్యవాదాలు తెలిపారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఇదే స్టేజిమీద’అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టాం. ఆ సినిమా వెయ్యి సినిమాల్లో ఒక సినిమా. ఇప్పుడు ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాను మళ్ళీ తీయాలంటే అది కేవలం డైరెక్టర్ ఇంద్ర వల్లనే సాధ్యం అవుతుంది. ఇంద్ర చాలా మంచోడు. నాకు ఈ కథ చెప్పినప్పుడు ఈ పోస్టర్ లో ఉన్నట్టు నిలువుగా రెండు రోజులు అయిపోయాను. సినిమా చూసాక కూడా మీరు కూడా ఇలాగే పోతారు. సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఇంగ్లీష్ సినిమా నా తెలుగు సినిమా నా అనే విషయం అర్థమవుతుంది. ఈ సినిమా చూస్తే పిచ్చెక్కిపోతారు. ఈ సినిమాకు హీరో స్క్రీన్ ప్లే,హీరోయిన్ స్టోరీ, డైరెక్టర్ ఇంద్ర. ఈ సినిమాలో నారా రోహిత్ సుధీర్ బాబు శ్రియా శరన్ ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మేము సినిమాల్లోకి వచ్చి ఎంత కష్టపడ్డామో ఇప్పటివరకు అంతకుమించి డైరెక్టర్ ఇంద్ర కష్టపడ్డాడు. నన్ను టార్చర్ పెట్టాడు. బెండు తీశాడు. కానీ అవుట్ ఫుట్ చూసుకున్నాక వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా అందరికీ నచ్చుతుంద. త్వరలోనే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తాం అది చూశాక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది మీకు అర్థమవుతుంది. అందరికీ చాలా థాంక్స్ అని అన్నారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ… ముందుగా ఈ పోస్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దిన భానుకి స్పెషల్ థాంక్స్ సినిమాను రిఫ్లెక్ట్ చేసేది పోస్టర్స్. ఈ సినిమాలో హీరోలు అంటూ ఉండరు. ప్రతీ క్యారెక్టర్ హీరోనే ఈ సినిమాకు. ఇది ఒక ప్రయోగాత్మకమైన చిత్రం. మన తెలుగులో అయితే కచ్చితంగా ఇలాంటి సినిమా రాలేదు. ఇంద్ర ప్రపంచాన్ని తలక్రిందులుగా చూశాడు. సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ తోటే ఉంటుంది. ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ అవుతుందని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook