“ది ఘోస్ట్” నైజాంలో రెండో రోజు వసూళ్లు ఇవే.!

Published on Oct 7, 2022 5:06 pm IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ది ఘోస్ట్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం నాగ్ కెరీర్ లో ఓ మంచి యాక్షన్ బ్లాక్ లు ఉన్న సినిమాగా ఇది నిలిచి అక్కినేని ఫాన్స్ కి అయితే మంచి ట్రీట్ లా మారింది. ఇక ఈ చిత్రం అయితే మొదటి రోజు ఓపెనింగ్స్ నే వరల్డ్ వైడ్ అందుకుంది.

ఇక నైజాం లో అయితే ఫస్ట్ డే అక్కడ 1.6 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు వసూళ్ల డీటెయిల్స్ ఇప్పుడు తెలుస్తుంది. మరి రెండో రోజు అయితే ఘోస్ట్ 60 లక్షలు వసూలు చేసింది అట. మరి దీనితో అయితే నైజాం లో రెండు రోజులకి గాను 2.2 కోట్ల షేర్ ని అందుకుంది. మరి ఇవి ఒకింత తక్కువే కానీ వీకెండ్ లో అయితే బెటర్ కావచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించగా మార్క్ కె రాబిన్ అయితే సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :