ఆకట్టుకుంటున్న’ ది ఘోస్ట్ ‘ ర్యాప్ సాంగ్

Published on Oct 3, 2022 10:24 pm IST


కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ అక్టోబర్ 5 న దసరా కానుకగా ప్రేక్షులముందుకు రానున్న విషయం తెలిసిందే. సోనాల్ చౌహాన్ హీరయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుండి దూరాలైన తీరాలైన అనే పల్లవితో సాగే ర్యాప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మనోజ్ కుమార్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ని రోల్ రైడా, అనురాగ్ కులకర్ణి అధ్బుతంగా ఆలపించారు. మార్క్ కే రాబిన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతుంది. మరి దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :