పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, బ్లెసీ రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్వైవల్ డ్రామా ది గోట్ లైఫ్ (the goat life). తాజాగా ఈ చిత్రం కి సంబందించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మార్చ్ 28, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగు లో కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని తెలుగు లో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్ట్ లో వెల్లడించారు.
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. మలయాళం లో ఫేమస్ అయిన ఆడు జీవితం నవల ఆధారం గా సినిమా తెరకెక్కుతోంది. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
The long wait gets shorter…#TheGoatLife releasing worldwide on 28th March, 2024!#Aadujeevitham #TheGoatLifeOn28thMarch
Telugu Release by @MythriOfficial@Thegoatlifefilm @DirectorBlessy @benyamin_bh @arrahman @prithviofficial @Amala_ams @Haitianhero @rikaby @resulp… pic.twitter.com/IJwa3JgaU7
— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2024