సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుండగా జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, రఘుబాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు.
విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్ లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ లో ఒక షెడ్యూల్ జరుపుకుంటోంది. అయితే అక్కడి షెడ్యూల్ లో భాగంగా సెట్స్ నుండి మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి వారి పిక్స్ తో పాటు వీడియోస్ లీక్ కావడంతో గుంటూరు కారం టీమ్ తలలు పట్టుకుంటోంది. ఎంతగా ఈ లీక్స్ ని ఆపాలని వారు చూస్తున్నప్పటికీ వీలు కావడం లేదని, అందుకే ఇకపై ఇటువంటివి జరుగకుండా టీమ్ మొత్తం కూడా మరింత గట్టిగా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2024 జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.