డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “కాశ్మీర్ ఫైల్స్”…ఎప్పుడంటే?

Published on Apr 25, 2022 4:12 pm IST

ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం, భారీ సంచలనం సృష్టించిన కాశ్మీర్ ఫైల్స్ ఎట్టకేలకు జీ 5 లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ రోజు, జీ 5 తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. మే 13, 2022 నుండి తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి కాశ్మీర్ ఫైల్స్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. హిందీతో పాటు, ఈ చిత్రం తెలుగు, కన్నడ మరియు తమిళంలో కూడా అందుబాటులో ఉంటుంది. జీ స్టూడియోస్‌తో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల రూపాయల వరకు వసూళ్ళను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

సంబంధిత సమాచారం :