250 కోట్ల కి చేరువలో “ది కాశ్మీర్ ఫైల్స్”

Published on Apr 4, 2022 4:04 pm IST

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం లో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చిన్న చిత్రం గా విడుదల అయిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయినప్పటికీ వసూళ్ల పరంగా తన సత్తా కొనసాగిస్తూనే ఉంది. ఈ చిత్రం ఇప్పటి వరకూ 245 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం త్వరలో 250 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసే అవకాశం ఉంది.

కాశ్మీర్ పండిట్ ల ఆధారం గా తెరకెక్కిన ఈ చిత్రం లో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మండ్ లేకర్, ప్రకాష్ బెలావాడి, పునీత్ ఇస్సార్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :