వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “ది కాశ్మీర్ ఫైల్స్”

Published on Jul 19, 2022 2:01 pm IST

చిన్న చిత్రం గా రిలీజ్ అయ్యి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఈ కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా రాగా, ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు లోకి రానుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం జీ తెలుగు లో ప్రసారం కానుంది. జీ స్టూడియోస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐయాం బుద్ధ ప్రొడక్షన్ ల పై ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి లు నిర్మించడం జరిగింది. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :