బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా “ది కేరళ స్టోరీ”

బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా “ది కేరళ స్టోరీ”

Published on May 29, 2023 10:05 PM IST

చిన్న చిత్రం గా వివాదాల నడుమ రిలీజైన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రం రిలీజై ఇన్ని రోజులు గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి డ్రాప్ ను చూడటం లేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం నిన్న మరో 4.75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకూ 224.9 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద నాల్గో వారాంతం ఈ తరహా వసూళ్లను రాబడుతూ, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

కొత్త చిత్రాలు రిలీజైనప్పటికి, ఎలాంటి డ్రాప్ ను చూడటం లేదు. అదా శర్మ, సిద్ది ఇద్నాని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుదిప్తో సేన్ దర్శకత్వం వహించారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు