“ది కేరళ స్టోరీ”…200 నాటౌట్!

Published on May 23, 2023 2:49 pm IST

ది కేరళ స్టోరీ చిత్రం చిన్న సినిమా గా థియేటర్ల లో విడుదల అయ్యి, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్ బాగుంటే, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు అని మరోసారి ది కేరళ స్టోరీ చిత్రం తో రుజువైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ గా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. ఈ చిత్రం సోమవారం రోజు మరో 4.50 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ 203.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం తో చిత్ర యూనిట్ సంతోషం లో ఉంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది. వీక్ డేస్ కావడం తో కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయిన, ఆదరణ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. సుదిప్తో సేన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో అదా శర్మ, సిద్ది ఇద్నానీ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :