ఓటిటి సమీక్ష: ‘ది లాస్ట్ షో’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

The Last Show

విడుదల తేదీ : డిసెంబర్ 21, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : చరణ్ లక్కరాజు, ధీరా పిసాటి, గిరిధర్ తదితరులు
దర్శకుడు : ప్రదీప్ మద్దాలి
నిర్మాతలు : కౌముది కే నేమాని
సంగీత దర్శకుడు : సాకేత్ కొమండూరి
సినిమాటోగ్రాఫర్ : ప్రవీణ్ వనమాలి
ఎడిటర్ : మైఖేల్ డి సెల్వ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ప్రతీ వారం లానే ఈ వారం కూడా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వస్తున్న కథా సుధా వీక్లీ సిరీస్ నుంచి వచ్చిన తాజా లఘు చిత్రమే “ది లాస్ట్ షో” (The Last Show). మరి ఈ షార్ట్ ఫిలిం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

The Last Show కథ:

ఒక రేడియో జాకీగా పని చేసే ఆద్య (ధీరా పిసాటి) తనకి బ్రేకప్ కావడంతో పెళ్లిపై అంత ఇంట్రెస్ట్ చూపించదు. తన మాజీ ప్రియుడు వరుణ్ (చరణ్ లక్కరాజు) నుంచి బయటకి రాలేక సతమతం అవుతుంది. కానీ వరుణ్ మాత్రం బ్రేకప్ తర్వాత పెళ్ళికి రెడీ అయ్యాడని తెలుసుకొని ఆమె కూడా పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. ఆ నిర్ణయంతోనే రేడియో జాకీగా కూడా ఒక లాస్ట్ షో చేయాలని డిసైడ్ అవుతుంది. కానీ మళ్ళీ ఇద్దరూ ఎలా కలిశారు? అందుకు దోహదపడ్డ పరిస్థితులు ఏంటి? అసలు ఎందుకు ఈ ఇద్దరూ విడిపోయారు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో యువ నటీనటులు ఇద్దరూ మంచి పెర్ఫామెన్స్ లని అందించారు అని చెప్పొచ్చు. చరణ్, ధీరా ఇద్దరూ తమ పాత్రల్లో సూటయ్యి మంచి సెన్సిబుల్ నటనను కనబరిచారు. ఇద్దరు ప్రేమికుల్లా అందులో ఉండే ఎమోషన్ ని పలికించారు.

అలాగే నటుడు గిరిధర్ కూడా తన రోల్ కి సూటయ్యారు. అలాగే ఈ సినిమా ఎక్కువగా ఒక నీట్ లవ్ స్టోరీస్ లాంటి వాటిని ఇష్టపడేవారికి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే వీరి లవ్ ట్రాక్ లో మనస్పర్థలు చివరిలో ఎండింగ్ మీనింగ్ ఫుల్ గా ఉంది. అలాగే క్లైమాక్స్ ఎండింగ్ కూడా డీసెంట్ గా ఉంది.

మైనస్ పాయింట్స్:

ఇదొక డీసెంట్ అటెంప్ట్ అయినప్పటికీ ఎమోషన్స్ పరంగా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. మధ్యలో ఆడియెన్స్ కొంచెం డీవియేట్ అవుతారు. కొంచెం స్లోగా సాగే కథనం కూడా మరో మైనస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ తరహా ట్రీట్మెంట్ తో కూడిన సినిమాలు లాంటివి ఆల్రెడీ చాలానే ఉన్నాయి కాబట్టి ఇందులో మరీ అంత కొత్తదనం కనిపించదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సంగీతం డీసెంట్ గా ఉంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి వర్క్ పర్వాలేదు అని చెప్పొచ్చు. రొటీన్ ప్రేమ కథనే డీసెంట్ గా మంచి ట్విస్ట్ తో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ ని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “ది లాస్ట్ షో” (The Last Show) మాత్రం స్ట్రిక్ట్ గా లవ్ కంటెంట్ ని ఇష్టపడేవారికి కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. లీడ్ నటీనటులు మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. కాకపోతే మిగతా ఆడియెన్స్ లో మాత్రం అంత ఇంపాక్ట్ కలిగించలేకపోవచ్చు. సో ఓ సింపుల్ అండ్ మంచి ఎండింగ్ కోరుకునే లవ్ డ్రామా చూడాలి అనుకునేవారికి ఇది పర్వాలేదు అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version