‘మైఖేల్’ మూవీ పై విజయ్ సేతుపతి గారు కురిపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్

Published on Feb 1, 2023 2:30 am IST

యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ లవ్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ మైఖేల్. రంజిత్ జయంకోడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తుండగా ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా కనిపించనున్నారు. ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన మైఖేల్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించగా నాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా నిర్మాతలు భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు గార్లు అందించిన సహకారమే కారణం అన్నారు. అలానే కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి గారు మా మీద మా మూవీ మీద చూపించిన ప్రేమని ఎన్నటికీ మరువలేను, అలానే సంగీత దర్శకుడు సామ్ సి ఎస్, డీవోపీ కిరణ్ కౌశిక్ ఈ మూవీకి పెద్ద పిల్లర్స్ అని, దర్శకుడు రంజిత్ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని, ఇక టీమ్ మొత్తం కూడా మైఖేల్ కోసం కష్టపడ్డారని, ఫిబ్రవరి 3న రానున్న ఈ మూవీని మీ అందరూ ఆదరించాలని కోరారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :