డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ : ‘థాంక్యూ’ మూవీలోని మ్యాజిక్ తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ : ‘థాంక్యూ’ మూవీలోని మ్యాజిక్ తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది

Published on Jul 14, 2022 10:30 PM IST

దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థాంక్యూ. రొమాంటిక్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన థాంక్యూ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా థమన్ ఈ మూవీకి ఎంతో సోల్ ఫుల్ మ్యూజిక్ అందించారని చెప్పాలి. రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ ఈనెల 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ప్రత్యేకంగా మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఇప్పుడు చూద్దాం.

మన లైఫ్ లో ఉపయోగించే పదాల్లో థాంక్యూ అనేది ఎంతో గొప్ప ప్రాముఖ్యత గల పదం. నిజానికి ఇంత గొప్ప పదాన్ని మనం అవసరం అయినపుడు మాత్రం ఉపయోగించకుండా దానికి అసలు మనం ఏ మాత్రం విలువ లేకుండా చేసాము.

నిజానికి నా లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తి మా నాన్న. నాకు ఎన్నో ఇచ్చారు, కానీ నేడు ఏనాడు ఆయనకు థాంక్యూ చెప్పనేలేదు. ఒకనాడు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఏ తల్లితండ్రి కూడా తమ బిడ్డల నుండి థాంక్యూ అనే పదాన్ని ఆశించరు, ఒకవేళ మనం వారికీ థాంక్యూ చెప్తే వారికి కోపం వస్తుంది కూడా. కానీ ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాల్లో తల్లితండ్రులకు ప్రత్యేకంగా థాంక్యూ చెప్పితీరాలి.

మూడు నాలుగేళ్ళ నుండి నేను, చైతు కలిసి ఒక మూవీ చేయాలనే ఆలోచన చేస్తున్నాం, అలా అనుకోకుండా ఒక సందర్భంలో వచ్చిన ఆలోచనే ఈ మూవీ. ఈ మూవీ నా కెరీర్ లో చైతు కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ మూవీలో చైతు 16 ఏళ్ళ పిల్లాడిలా, 21 ఏళ్ళ యువకుడిలా అలానే 38 ఏళ్ళ మధ్యవయస్కుడిలా కనపడతారు. మొత్తంగా సినిమాలో ఆయన పోషించిన మూడు వేరియేషన్స్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటాయి.

నిజానికి ఏ నటుడికి అయినా 16 ఏళ్ళ పిల్లాడిలా కనిపించాలి అంటే అది అంత సులువు కాదు. కానీ చైతు ఈ మూవీలోని ఆ పాత్ర కోసం దాదాపుగా 45 రోజులు డైట్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని శారీరకంగా తనని తాను మార్చుకుని ఎంతో శ్రమపడ్డారు. దానికి సంబంధించి పూర్తి క్రెడిట్ తనకే ఇవ్వాలి.

పలువురు మా మూవీ ని ఆటోగ్రాఫ్, ప్రేమమ్ మూవీస్ తో పోలుస్తున్నారు. నిజానికి అది ఒకరకంగా మంచిదే, అలానే అది మూవీకి కూడా ప్లస్ అవుతుంది. అయితే అవి ఒక వ్యక్తి యొక్క జర్నీకి సంబందించినవి, కానీ మా సినిమాకి ఆ సినిమాలకు టచ్ ఉండదు. అవి వేరు, ఇది వేరు.

ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయిన తరువాత ప్రారంభానికి ముందు నేను, చైతు కొందరికి థాంక్స్ చెప్పాలని అనుకుని భావించాం, ఆ ఫీల్ మా ఇద్దరికీ కలిగిన అనంతరం చెప్పాము కూడా. కొద్దిరోజుల తరువాత షూటింగ్ మొదలెట్టిన మేము సక్సెస్ఫుల్ గా షూట్ మొత్తం పూర్తి చేసాము. ఈ మూవీలో ఒక గొప్ప మ్యాజిక్ ఉంది, తప్పకుండా అది ఆడియన్స్ మనసులని తాకుతుందనే నమ్మకం ఉంది.

దర్శకుడిగా నేను వేరే వారి కథకి కనెక్ట్ కాలేనపుడు దానికి న్యాయం చేయలేను కదా, అందుకే ఈ మూవీ కథని బివిఎస్ రవి తీసుకుని వచ్చినపుడు అందులోని సోల్ ఎంతో బాగా నచ్చింది. దానిపై పూర్తిగా కసరత్తు చేసిన అనంతరం దానిని నా స్టైల్ లో ముందుకు తీసుకువెళ్లి చిత్రీకరించాను. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది.

ఇటువంటి ఫీల్ గుడ్ మూవీస్ కి మ్యూజిక్ అనేది ఎంతో ముఖ్యం. అందుకే థమన్ ని సెలెక్ట్ చేసాము. తాను మూవీ సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కూడా ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ముఖ్యంగా ఆయన అందించిన సోల్ ఫుల్ మ్యూజిక్ మూవీకి మరింతగా ప్రాణం పోసింది. ఈ విషయంలో థమన్ కి ప్రత్యేకంగా థాంక్యూ

మా మూవీలోని కీలకమైన అభిరాం పాత్ర యొక్క జర్నీలో రాశి ఖన్నా పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కథకి ఎంతో కీలకమైన ఆమె పాత్ర ప్రకారం ఒక ముఖ్య సన్నివేశంలో నటన అద్భుతంగా చేసారు. మానిటర్ లో ఆ సన్నివేశం చూసి పూర్తిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. మాళవికా నాయర్ కూడా అద్భుతమైన నటి, మా మూవీ లో కూడా మంచి క్యారెక్టర్ చేసారు, తప్పకుండా ఆమెకు కూడా మంచి పేరు వస్తుంది. ఇక అవికా గోర్ చిన్నప్పటి నుండి నటన వృత్తిలోనే కొనసాగుతున్నారు. మా మూవీలో తన పాత్ర కూడా ఎంతో ఆకట్టుకుంటుంది.

నిజానికి మనలో అనేకమంది జీవితంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలబడి ఆపైన పైకి వచ్చిన వారు ఉన్నారు. అయితే మనం అంత పైకి వచ్చే సమయంలో ఖచ్చితంగా మనతో పాటు ఉండి మనకు ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చారు వారు ఉంటారు, వారికి తప్పకుండా థాంక్స్ చెప్పాలి. కానీ అటువంటి వారిని కొందరు గుర్తించరు, గుర్తించినా కూడా వారికి థాంక్స్ చెప్పేందుకు మరికొందరికి అహం అడ్డం వస్తుంది. అయితే ఒక్కోసారి వ్యక్తులు మాత్రమే కాదు సందర్భాలు కూడా మనలో మార్పుకు దోహదం పడతాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కృతజ్ఞతా భావం మర్చిపోకుండా ఉండాలి అనేది మా మూవీ కాన్సెప్ట్.

ఎప్పటి నుండో దిల్ రాజు గారి బ్యానర్ లో ఒక మూవీ చేయాలని నా కోరిక. మధ్యలో పలు సందర్భాల్లో మేము ఇద్దరం మాట్లాడుకున్నాం కూడా. అయితే ఇప్పటివరకు సాధ్యపడలేదు. ఇక ఫైనల్ గా థాంక్యూ రూపంలో అది సెట్ అయింది. ఇటువంటి మంచి సినిమా రాజు గారితో కలిసి చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

ప్రస్తుతం చైతు తో కలిసి దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను. దాదాపుగా కొన్నాళ్ల నుండి షూటింగ్ జరుగుతున్న ఈ వెబ్ సిరీస్ లో మరొక 15 రోజుల తరువాత ఆయన పాత్ర యొక్క చిత్రీకరణ పూర్తి అవుతుంది.

సూర్య గారితో చేసిన సూపర్ హిట్ మూవీ 24 కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఎప్పటినుండో ఉంది. ఒక నాలుగైదు పేజీలు దాని కోసం రాసుకున్నాను. అయితే ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. ముఖ్యంగా అందులోని ఆత్రేయ పాత్రని ఎలా ఈ భాగంలో ఆవిష్కరించాలి అనే ఆలోచన చేస్తున్నాను, త్వరలో దానిని పూర్తి చేసిన అనంతరం పూర్తి వివరాలు చెప్తాను.

త్వరలో ప్రముఖ సంస్థ మైత్రి మూవీస్ వారితో ఒక మూవీ చేయడానికి కథా చర్చలు జరుగుతున్నాయి. అది ఇంకా సెట్ కాలేదు, కొంత టైం పడుతుంది. అనే ఒక హిందీ మూవీ కూడా చేయాలనే ఆలోచన ఉంది, అది కూడా చర్చల దశలోనే ఉంది. అది యాక్షన్ సినిమా, ఇక వీటి గురించి పూర్తిగా కథలు సిద్ధం అయి, ప్రాజక్ట్స్ అనౌన్స్ చేసే సమయంలో చెప్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు