20 ఏళ్ల సినీ కెరీర్ పై అల్లు అర్జున్ కు ‘పుష్ప’ మేకర్స్ అభినందనలు

Published on Mar 28, 2023 8:09 pm IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారిగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి విజయం అందుకుని ఆయనకు పేరుని అందించింది. అనంతరం సుకుమార్ తో చేసిన ఆర్య మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, అక్కడి నుండి ఒక్కో సినిమా అవకాశంతో దూసుకెళ్లారు. ఆపైన కెరీర్ పరంగా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి స్టైలిష్ స్టార్ గా అలానే ఐకాన్ స్టార్ గా ఎందరో ఫ్యాన్స్ యొక్క ప్రేమని సొంతం చేసుకున్నారు.

ఇక ఇటీవల సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప తో దేశవ్యాప్తంగా ఆడియన్స్ అభిమానాన్ని అందుకున్న అల్లు అర్జున్ నేటితో సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ తో పాటు ఇంతగా ఆదరిస్తున్న ఆడియన్స్ కి ఆయన ప్రత్యేకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం పుష్ప 2 లో హీరోగా నటిస్తున్న అల్లు అర్జున్ కి 20 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు కొద్దిసేపటి క్రితం ఆ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేసారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకుకోవాలని కోరుతూ వారు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :