నాచురల్ స్టార్ హీరోగా యంగ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామానే ది ప్యారడైజ్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గ్యాప్ తక్కువ ఉన్నప్పటికీ హైప్ మాత్రం గట్టిగానే ఉంది.
అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల లలో కూడా ఉన్నారు. అయితే అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ అందుకుంది. కానీ మధ్యలో స్లో అయ్యింది. ఇక మళ్లీ సినిమా ఎక్కువ ప్రదేశాల్లో బుకింగ్స్ తెరుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో మళ్లీ ఊపందుకుంది.
తాజాగా సినిమా 3 లక్షల 50 వేల డాలర్లు మార్క్ ని క్రాస్ చేసేసింది. సో ఇక రిలీజ్ నాటికి ఇదే స్పీడ్ కొనసాగితే నాని కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సినిమాల నుంచి బిగ్గెస్ట్ ఓపెనర్లు లలో ఒకటిగా ది ప్యారడైజ్ నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
