నాచురల్ స్టార్ నాని అంటే టాలీవుడ్ నిర్మాతల్లో మాత్రమే కాకుండా ఓటిటి సంస్థల దగ్గర కూడా ఒక మినిమమ్ గ్యారెంటీ ఉంది. అలా ఒకో మెట్టు ఎక్కుతూ నాని తన కెరీర్ గ్రాఫ్ ని భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఇలా తన నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’తో టైర్ 1 లోకి ఎంటర్ అయ్యేంత ఇంపాక్ట్ ని చూపించి తన పొటెన్షియల్ ఇది అని ప్రూవ్ చేసాడు.
కానీ అదే సినిమా ఊహించని రన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎలాంటి ట్రైలర్ లేకుండానే డే 1 కి 80 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ సెట్ చేసింది. ఇలా విడుదలకి ముందు వరకు విడుదల ముందు రోజు ఓ రేంజ్ లో బుకింగ్స్, వసూళ్లతో దంచికొట్టిన ఈ సినిమా విపరీతమైన నెగిటివిటీతో పూర్తి స్థాయిలో నిలబడలేకపోయింది.
అంత నెగిటివిటీలో కూడా నాచురల్ స్టార్ ఈ సినిమాని మొదటి వారం అంతా స్ట్రాంగ్ గా నిలిపగలిగాడు. కానీ అప్పటికే డ్యామేజ్ ఎక్కువే జరిగింది. సో ఎన్నో అంచాలి నడుమ వచ్చిన ఈ సినిమా తక్కువ రోజుల థియేట్రికల్ రన్ తోనే ముగుస్తుంది. పొరపాటున ఈ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్ పాజిటివ్ టాక్ ని పడి ఉంటే ప్యారడైజ్ సెట్ చేసే లెక్కలు మరో రీతిలో ఉండేవి.
