”ది రాజా సాబ్” ఆడిష‌న్స్ పై మేకర్స్ కార్లిటీ!

”ది రాజా సాబ్” ఆడిష‌న్స్ పై మేకర్స్ కార్లిటీ!

Published on Jul 5, 2024 11:12 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ ‘క‌ల్కి 2898 AD’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌గా, మైథాల‌జి సైఫై మూవీగా ఇది ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తోంది. కాగా, ఈ సినిమా త‌రువాత ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ మూవీగా ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్న ‘ది రాజా సాబ్’ ఇప్పటికే షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన‌ ఆడిష‌న్స్ జ‌రుగుతున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల వ‌స్తున్న వార్త‌ల‌పై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ”ఈ వార్త‌ల‌న్నీ కూడా ఫేక్ అని.. ఇలాంటి వార్త‌ల‌ను అభిమానులు ఎంక‌రేజ్ చేయొద్ద‌ని.. ఏదైనా ఉంటే తాము అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేస్తామ‌ని” మేక‌ర్స్ త‌మ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక ‘ది రాజా సాబ్’ మూవీలో ప్ర‌భాస్ వింటేజ్ లుక్ లో క‌నిపిస్తుండ‌గా.. మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తుండ‌గా, థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు