పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుండి బర్త్ డే ట్రీట్‌గా వచ్చిన మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఎవరూ ఊహించని గెటప్‌లో ప్రభాస్ కనిపించడంతో అభిమానులు సైతం అవాక్కయ్యారు. ఇక ఈ మోషన్ పోస్టర్‌కి సంబంధించిన గ్లింప్స్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఈ మోషన్ పోస్టర్‌కి యూట్యూబ్‌లో ఏకంగా 10 మిలియన్ ప్లస్ వ్యూస్ దక్కినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. అంతే కాకుండా ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుందని వారు తెలిపారు. ఇలా ‘ది రాజా సాబ్’ మోషన్ పోస్టర్‌తోనే సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కడంతో.. మున్ముందు రాబోయే ట్రీట్‌లకు ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ‘ది రాజా సాబ్’ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The WORLD is witnessing an ignition BLAZING like never before ????????????????????????#RecordBreakingRajaSaab ❤️#Prabhas #TheRajaSaab pic.twitter.com/5KUBisLlfP
— The RajaSaab (@rajasaabmovie) October 24, 2024