రియల్ “గేమ్ ఛేంజర్” చరణ్..ఫస్ట్ లుక్ తో రికార్డ్స్ స్టార్ట్.!

Published on Mar 28, 2023 4:00 pm IST

మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. నిన్న చరణ్ బర్త్ డే కానుకగా మేకర్స్ అవైటెడ్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్స్ ని అయితే రిలీజ్ చేశారు. మరి ఈ సాలిడ్ పోస్టర్స్ ని చరణ్ కూడా తన సోషల్ మీడియాలలో రిలీజ్ చేయగా టాలీవుడ్ లో అయితే ఫాస్టెస్ట్ ఎవర్ రికార్డు నెలకొల్పినట్టుగా తెలుస్తుంది.

టాలీవుడ్ హీరోస్ లో తమ పోస్టర్స్ ని రిలీజ్ చేయగా 24 గంటలు పూర్తి కాకముందే లక్ష లైక్స్ సాధించిన ఫస్ట్ పోస్టర్ గా అయితే చరణ్ మాసివ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. దీనితో టైటిల్ కి తగ్గట్టుగానే రియల్ గేమ్ ఛేంజర్ గా నిలిచాడు అని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :