‘లూసియా’ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వినోద్ వి ధోండలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏదో ఏదో’ అంటూ సాగే అందమైన మెలోడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను, అద్భుతమైన కెమిస్ట్రీని ఆవిష్కరిస్తూ సాగే ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జయచంద్ర జె.డి. సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సాయి చరణ్, ఎం.డి. పల్లవి ఆలపించగా.. పూర్ణచంద్ర తేజస్వీ స్వరాలు సమకూర్చారు. ఈ పాటలోని లొకేషన్లు, సంతు మాస్టర్ కొరియోగ్రఫీ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వృద్ది క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్లపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి వచ్చింది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
