నేడు రాధే శ్యామ్ మేకింగ్ వీడియో ను విడుదల చేయనున్న టీమ్

Published on Mar 4, 2022 4:00 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం రాధే శ్యామ్. యూ వీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ను మార్చ్ 11 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ మేరకు అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ మేరకు నేడు రాత్రి ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉండటం తో అభిమానులు , ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :