అరవిందలో ఆ సాంగ్ అదిరిపోతుందట !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని మొదటి సాంగ్ ‘అనగనగ ‘ఇటీవల విడుదలై డీసెంట్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సాంగ్ తో అయన అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తిని చెందలేదనేది వాస్తవం. ఇక తాజాగా వారి అంచనాలను అందుకొని వారికీ మెమరబుల్ సాంగ్ గా నిలిచిపోనుందట ఈచిత్రంలోని రెండవ సాంగ్.

‘పెనీవిటి’ అంటూ సాగె ఈ సాంగ్ అదిరిపోనుందని సమాచారం. ఇక రీసెంట్ గా ఈసాంగ్ విన్న యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ సాంగ్ ఫై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం ఈసాంగ్ ను విన్నాను. సాంగ్ అదిరిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు ఈ సాంగ్ గుర్తిండిపోతుంది. తమన్ సంగీతం ,రామజోగయ్య శ్రాస్తి లిరిక్స్ అద్భుతమని ఆయన అన్నారు.

ఇక ఈసాంగ్ లిరికల్ వీడియో రూపంలో రేపు సాయంత్రం 4:50 గంటలకు విడుదలకానుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకానుంది.

Exit mobile version