మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరిస్తున్న ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ ట్రైలర్

మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరిస్తున్న ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ ట్రైలర్

Published on Nov 5, 2023 12:00 AM IST

లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్న జిగర్తాండ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి ఇంట్రెస్ట్ ఏర్పరిచాయి.

ఇక నేడు ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ప్రకారం ఈ స్టోరీ 1975లో ప్రారంభం అవుతుంది. లారెన్స్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండగా ఎస్ జె సూర్య ఒక డైరెక్టర్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లో లారెన్స్ యాక్టింగ్, స్టైల్, డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్ బాగున్నాయి.

అలానే ఎస్ జె సూర్య సీన్స్, యాక్టింగ్ కూడా అలరించాయి. ఇక విజువల్స్ తో పాటు బీజీఎమ్ కూడా ట్రైలర్ లో బాగుంది. మొత్తంగా ఈ ట్రైలర్ ఎంతో ఆకట్టుకునేలా సాగడంతో పాటు మూవీ పై మంచి ఇంట్రెస్ట్ ని ఏర్పరిచింది. కార్తికేయన్ సంతానం, ఎస్ కథిరెసన్ కలిసి ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా దీనిని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో నవంబర్ 10న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు