లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్

Published on Mar 11, 2023 10:30 pm IST

నాగశౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన లేటెస్ట్ లవ్, రొమాంటిక్, ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. గతంలో నాగశౌర్య తో శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన ఊహలు గుసగుసలాడే, జ్యో అచుతానంద సినిమాలు రెండూ మంచి సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరి కలయికలో వస్తున్న మూడవ మూవీ అయిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ పై అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, టీజర్ ఆకట్టుకోగా నేడు ఈమూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలపై టిజి విశ్వప్రసాద్, దాసరి పద్మజ ఎంతో గ్రాండ్ గా ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ ట్రైలర్ ని పరిశీలిస్తే హృద్యమైన రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అలరించే విజువల్స్, సున్నితమైన డైలాగ్స్ తప్పకుండా ఆడియన్స్ లో సినిమా చూడాలనే ఆసక్తిని ఏర్పరుస్తాయి. ఈ మూవీలో సంజయ్‌గా నాగశౌర్య, అనుపమగా మాళవికను ట్రైలర్ లో పరిచయం చేశారు.

లీడ్ పెయిర్ ఇద్దరూ వివిధ వయసులలో ట్రైలర్ లో ఆకట్టుకున్నారు. నాగశౌర్య డిఫరెంట్ గెటప్‌లలో కూల్‌గా కనిపిస్తుండగా, మాళవిక అందంగా ఉంది. ఎమోషన్స్‌తో కూడిన సింపుల్ ప్రెజెంటేషన్‌ తో ఆహ్లాదకరమైన డైలాగ్స్ తో డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ట్రైలర్‌లో మరొకసారి తనదైన ముద్ర వేశారు. మొత్తంగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 17న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :