థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘రావణాసుర’ ట్రైలర్

Published on Mar 28, 2023 4:14 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా దక్ష నాగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ మూవీని యువ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెకెక్కించారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ అందరినీ ఆకట్టుకోగా నేడు ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసారు మేకర్స్.

ముందుగా ఈ ట్రైలర్ లో థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలు అయితే ఎంతో బాగున్నాయి అని చెప్పాలి. ఇక మాస్ మహారాజ, సుశాంత్ తో పాటు పలువురు ఇతర నటుల లుక్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, అలానే ముఖ్యంగా డైలాగ్స్ ఇలా అన్ని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. మొత్తంగా మంచి యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రస్తుతం రావణాసుర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ బాగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతోంది అనే చెప్పాలి. ఇక ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెంచేసిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :