ఆకట్టుకుంటున్న “ది ట్రిప్” సినిమా ఫస్ట్ లుక్

ఆకట్టుకుంటున్న “ది ట్రిప్” సినిమా ఫస్ట్ లుక్

Published on Oct 26, 2021 7:06 PM IST


ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో VDR ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న సినిమా ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.

కార్తిక్ కొడకండ్ల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు, విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు