సస్పెన్స్ థ్రిల్లర్ “ది టర్న్” ఫస్ట్ గ్లింప్స్ విడుదల..!

Published on Sep 24, 2021 11:00 pm IST


ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా డీబీ దొరబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది టర్న్’. కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వాసంతి, రత్నమాల, మనోహర్ వల్లెపు, లడ్డు, అరుణ్ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే నేడు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత భీమినేని శివ ప్రసాద్ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిర్మిస్తున్న “ది టర్న్” అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు. హీరో కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని ఈ సినిమాలో తన నటన చాలా బాగుందని అన్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేశామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు.

సంబంధిత సమాచారం :