హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా “ది టర్న్” ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల

Published on Sep 24, 2021 10:00 am IST


ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ది టర్న్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మనోహర్ వల్లెపు, లడ్డు, అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కౌశల్ క్రియేషన్స్ పతాకం పై డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కి RG సారథీ సంగీతం సమకూరుస్తుండగా ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ ను అందిస్తున్నారు. విజయ్ ఠాగూర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి ఆయన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా ఈరోజు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత భీమినేని శివ ప్రసాద్ మాట్లాడుతూ, “ది టర్న్ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మెచ్చే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. మా హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నటన చాలా బాగుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.

దర్శకుడు డీబీ దొరబాబు మాట్లాడుతూ, “నన్ను నమ్మి ఈ సినిమా ను నిర్మించడానికి ఒప్పుకున్న నిర్మాత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అనుకున్నట్లుగానే ఈ సినిమా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. కృష్ణ గారితో పనిచేయడం ఎంతో గొప్పగా ఉంది, తొందర్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు” అని అన్నారు.

సంబంధిత సమాచారం :