‘ది వారియర్’ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

Published on Jul 5, 2022 7:30 pm IST

రామ్ పోతినేని, కృతి శెట్టి ల క్రేజీ కాంబినేషన్ లో లింగుస్వామి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ బై లింగువల్ మూవీ ది వారియర్ పై రోజు రోజుకు అందరిలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ మూవీ సాంగ్స్ కి సూపర్ గా రెస్పాన్స్ రావడంతో పాటు అవి సినిమా పై బాగా అంచనాలు క్రియేట్ చేసాయి. సత్య ఐపీఎస్ గా రామ్ నటిస్తున్న ఈ మూవీలో గురు అనే విలన్ పాత్ర చేస్తున్నారు

ఆది పినిశెట్టి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతోన్న వారియర్ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. ఇక మరొక పది రోజుల్లో మూవీ రిలీజ్ కానుండడంతో యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే హీరో రామ్ మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇస్తుండగా రేపు ఈ మూవీ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెన్నై లోని సత్యం సినిమాస్ లో సాయంత్రం 6 గం. 30 ని. ల నుండి జరుగనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలానే త్వరలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపనున్నట్లు తెలుస్తోంది. మరి జులై 14న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ది వారియర్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :