నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది – అల్లు అర్జున్‌

నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది – అల్లు అర్జున్‌

Published on May 20, 2024 12:10 PM IST

దర్శకుల దినోత్సవంలో అల్లు అర్జున్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘పనిలో క్షణం తీరిక లేకుండా ఉండే దర్శకులు తమలో ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఒక్కచోటికి చేరి, ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి ఏడాదీ వేడుకని ఇంతే ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్ఫూర్తితో సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లలోని వివిధ విభాగాలు కూడా ముందుకొచ్చి వేడుకలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది’ అని బన్నీ తెలిపారు.

అల్లు అర్జున్ ఇంకా మాట్లాడుతూ.. ‘దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకులు దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని ప్రకటించినప్పుడు తనకెంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా దాసరితో తమకున్న అవినాభావ సంబంధాన్ని బన్నీ గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలో దర్శకులు అనిల్‌ రావిపూడి, శ్రీరామ్‌ ఆదిత్య, శైలేష్‌ కొలను లాంటి యువ దర్శకులు తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు