రైట్ టైమ్ లో రిలీజవుతున్న ‘రాంగ్ స్వైప్’..!

రైట్ టైమ్ లో రిలీజవుతున్న ‘రాంగ్ స్వైప్’..!

Published on Oct 30, 2021 11:38 PM IST

డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో ‘మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్” పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశభరిత వినోదాత్మక చిత్రం “రాంగ్ స్వైప్”. క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే ఎటువంటి విపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ “ఊర్వశి ఓటిటి” ద్వారా నవంబర్ 1న విడుదల కానుంది.

డాక్టర్ అయిన రవికిరణ్ సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్‌తో ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతో పాటు ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో రవికిరణ్ ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు.

నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ “లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారని, అన్నీ తానే అయి ముందుండి సినిమాని నడిపించారని, మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన “రాంగ్ స్వైప్” అందరికి నచ్చుతుందనే నమ్మకం తమకు ఉందని, కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు