మార్చి నుండి ఇండస్ట్రీ బంద్ ఖాయమన్న సి. కళ్యాణ్ !

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరి వలన ఏర్పడుతున్న సమస్యలకు నిరసనగా మార్చి 1వ తేదీ నుండి థియేటర్లు మూసివేసి, సినిమా షూటింగ్స్ ఆపివేయాలని తెలుగు నిర్మాతల మండలి సంచలనం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త పెద్ద దుమారంగా మారగా మార్చి 1 లోపు సమస్యలనే తొలగి బంద్ విరమించవచ్చని చాలా మంది ఆశావాదులు ఊహించారు.

కానీ ఇప్పటి వరకు సమస్య ఎలాంటి పరిష్కారం దొరికినట్టు కనిపించడంలేదు. సినిమాలో సెన్సార్ చేంజెస్ చేసినా యుఎఫ్ఓ, క్యూబ్ లాంటి సంస్థలు చార్జెస్ ఆడుతున్నాయని, దాని వలన కంటెంట్ ప్రొవైడర్స్ కు లాభం లేకుండా పోతుందని, తమ కంటెంట్ ను థియేటర్లలో ప్రదర్శించుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాలనే బంద్ కు దిగుతున్నామని, మార్చి 1 నుండి పరిశ్రమలో అన్ని పనులు ఆగిపోతాయని సి.కళ్యాణ్ తెలిపారు.

Exit mobile version