ఈరోజు కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిన అఖండ

Published on Dec 6, 2021 9:00 pm IST


నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్ లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీకెండ్ లో అద్దిరిపోయే వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం సోమవారం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చాలావరకు అన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇవ్వడం జరిగింది.

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం కావడం, సినిమా లో మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా థమన్ మ్యూజిక్ అద్దిరిపోవడం తో థియేటర్స్ కి రిపీట్ ఆడియెన్స్ వస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :