“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Sep 28, 2021 9:00 pm IST


అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

అయితే ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు తొలుత చిత్ర బృందం ప్రకటించినప్పటికీ, చివరకు ఆ తేదిని మారుస్తూ దసరా రోజు అక్టోబర్ 15వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే కాకుండా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌పై కూడా అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 30వ తేది సాయంత్రం 06:10 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

సంబంధిత సమాచారం :