టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో గజపతి అనే పవర్‌ఫుల్ పాత్రలో మంచు మనోజ్ తనదైన రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ట్రైలర్‌తో తనదైన మార్క్ యాక్టింగ్‌ను చూపించి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొల్పాడు. ఇక ఇప్పుడు ‘థీమ్ ఆఫ్ గజపతి’ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
‘థీమ్ ఆఫ్ గజపతి’ని మే 20న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఓ పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు.