‘అజ్ఞాతవాసి’ పై కన్ఫర్మేషన్ ఏది ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా రానున్నట్లు టీమ్ కన్ఫర్మ్ చేశారు. జనవరి 10న సినిమాను విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఖచ్చితమైన వార్తతో పాటే ఇంకో కన్ఫర్మేషన్ లేని న్యూస్ కూడా ప్రచారంలో ఉంది. అదే సినిమా టైటిల్ విషయం. ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ను ఖరారు చేశారని, కథ ప్రకారం ఆ టైటిల్ అయితేనే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు చెబున్నారు.

అభిమానులు కూడా ఈ వార్తను విపరీతంగా స్ప్రెడ్ చేయడంతో చాలా మంది ప్రేక్షకులు ఇదే అసలు టైటిల్ అని అనుకుంటున్నారు. కానీ ఈ విషయమై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఇదే అసలు టైటిల్ అని అనుకోలేం. కనుక పక్కా టైటిల్ ఏంటో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే పవన్ పుట్టినరోజు సందర్బంగా విడుదలచేసిన మ్యూజికల్ వీడియో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమానౌ హారిక, హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.