‘హరిహర వీరమల్లు’ కి సంబంధించి అందులో ఏ మార్పు ఉండదట ..?

‘హరిహర వీరమల్లు’ కి సంబంధించి అందులో ఏ మార్పు ఉండదట ..?

Published on Nov 19, 2022 7:14 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో అర్జున్ రామ్ పాల్, నర్గిస్ ఫక్రి, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇక హరిహర వీరమల్లు మూవీని 2023 మార్చి 30 న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మూవీ రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని, పక్కాగా ముందుగా అనుకున్న విధంగానే వీరమల్లు గ్రాండ్ లెవెల్లో పలు భాషల్లో థియేటర్స్ లోకి రావడం ఖాయం అని చెప్తున్నారు. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ తో పాటు రెండు టీజర్స్ కి పవన్ ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు అవి మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి. మరి వచ్చే ఏడాది రిలీజ్ కానున్న హరిహర వీరమల్లు ఎంతమేర అంచనాలు అందుకుంటుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు