టాక్..”హరిహర వీరమల్లు” కొత్త గ్లింప్స్ లేదా.?

టాక్..”హరిహర వీరమల్లు” కొత్త గ్లింప్స్ లేదా.?

Published on Dec 28, 2022 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా షూట్ ఆల్ మోస్ట్ దగ్గరకి వస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ తో పాటుగా పవన్ పాలిటిక్స్ లో కూడా మంచి బిజీగా ఉండగా గత కొన్ని రోజులు కితం అయితే ఈ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపించింది.

పవన్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఖుషి సినిమా రీ రిలీజ్ డిసెంబర్ 31న ఉండగా దీనితో అయితే వీరమల్లు కొత్త గ్లింప్స్ ని యాడ్ చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ వచ్చాయి.. దీనిని మేకర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే వారు గ్లింప్స్ ని కన్ఫర్మ్ చేశారు కానీ కొత్తది అని ఎక్కడా మెన్షన్ చేసినట్టు లేదు. సో ఈసారి మాత్రం కొత్త గ్లింప్స్ ఉండే ఛాన్స్ లేనట్టే తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు