ఈ దీపావళికి పెద్ద సినిమాలు లేవు కానీ ఫస్ట్ లుక్స్ మాత్రం ఉన్నాయ్ !

28th, October 2016 - 12:02:34 PM

telugu-cinema-logo
పరిశ్రమలోని నిర్మాతలు, హీరోలు, దర్శకులు, అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే సీజన్లలో సంక్రాంతి, సమ్మర్, దసరా తరువాత దీపావళి సీజన్ కూడా ఒకటి. ఈ సీజన్లో కూడా సినిమా రిలీజ్ చేస్తే మంచి ఫలితాల్ని రాబట్టవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాల వైపు చూసేది అపుడే కాబట్టి. అందుకే ప్రతి దీపావళికి కనీసం ఒకటి లేదా రెండు పెద్ద స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగుతుంటాయి. అలాకాని పక్షంలో కనీసం ఒక పెద్ద సినిమా అయినా విడుదలవుతుంది.

కానీ విచిత్రంగా ఈసారి దీపావళికి మాత్రం ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా విడుదలవడం లేదు. పవన్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలంతా పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులను చేస్తున్నారు. కానీ ఎందుకో వారిలో ఒక్కరు కూడా దీపావళి రిలీజ్ కు ప్లాన్ చేసుకోలేదు. ఇక వేరే మీడియం, చిన్న హీరోలైనా సందడి చేస్తారా అంటే అదీ లేదు. కేవలం ఈ దీపావళికి తమిళ హీరో కార్తి చేసిన ‘కాష్మోరా’ ద్విభాషా చిత్రమే ప్రేక్షకులకు చాయిస్ అయింది. మొత్తంగా చెప్పాలంటే మన తెలుగు హీరోలంతా ఈ దీపావళిని బాయికాట్ చేశారనే అనాలి.