“సర్కారు వారి పాట” ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదా?

Published on Jan 20, 2022 7:03 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. హిట్ దర్శకుడు పరశురాం పెట్ల ఈ చిత్రాన్ని సాలీడ్ హంగులతో తెరకెక్కిస్తున్నారు. మరి మహేష్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఈ చిత్రంపై రీసెంట్ గా ఓ టాక్ అయితే వైరల్ అవుతుంది.

ఈ చిత్రం ఔట్ ఫుట్ అనుకున్న స్థాయిలో రాలేదు అని మళ్ళీ రీ షూట్స్ చేస్తున్నారని.. కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కానీ అసలు ఇందులో ఎలాంటి నిజం లేదట. ఇప్పటివరకు సినిమా ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదట. ప్రతి షాట్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు కూడా డైరెక్ట్ షూట్ జరుగుతుంది తప్పితే ఎలాంటి రీషూట్ కాదని తెలుస్తోంది. సో ఈ సినిమా రీ షూట్స్ జరుగుతుంది అనే మాట అయితే నిజం కాదు. ప్రస్తుతం రిలీజ్ డేట్ పట్ల ఆసక్తి నెలకొంది..

సంబంధిత సమాచారం :