“మహేష్ 28” ఆ వార్తల్లో నిజం లేదు.!

Published on Feb 4, 2023 5:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎనలేని సాలిడ్ హైప్ ఉండగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఆ మధ్య సంగీత దర్శకుడు థమన్ విషయంలో పలు రూమర్స్ బయటకి వచ్చాయి.

థమన్ ని తీసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని పెడుతున్నారని చాలానే వచ్చాయి. ఇప్పుడు అలాగే మరో షాకింగ్ న్యూస్ థమన్ అపి వైరల్ గా మారింది. ఈ సినిమాకి థమన్ సమకూర్చిన మొదటి ట్యూన్ నే మహేష్ మరియు త్రివిక్రమ్ లు రిజెక్ట్ చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఇంచు కూడా నిజం లేదట. ఇవన్నీ కేవలం ఫేక్ ప్రచారాలు మాత్రమే అని తెలుస్తుంది. సో థమన్ పై వైరల్ అవుతున్న ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

సంబంధిత సమాచారం :