“కేజీయఫ్ 2” తెలుగుకి అక్కడ మాత్రం అనుకున్నంత లేదా.?

Published on Apr 12, 2022 8:02 am IST

లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసేందుకు సమాయత్తం అవుతున్న భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల ఒకింత ఒరిజినల్ కన్నడ ఆడియెన్స్ కంటే ఆడియెన్స్ నే చాలా ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్ కి మాత్రం అనుకున్నంత హైప్ లేనట్టు తెలుస్తుంది. మంచి బుకింగ్స్ నమోదు అవుతున్నా RRR ని మించిన బుకింగ్స్ కానీ ఓ క్రేజీ సీక్వెల్ కి ఉండే హైప్ గాని అనుకున్న రేంజ్ లో కనిపించంలేదు. ఈ పాటికే ఎప్పుడో 1 మిలియన్ ప్రీమియర్స్ బుకింగ్స్ జరిగిపోవాల్సి ఉంది కానీ ఇంకా ఆ మార్క్ కి చేరువలోనే ఉంది మరి ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :