SSMB 28 : ఆ విషయంలో ఏ మార్పు ఉండబోదట ?

SSMB 28 : ఆ విషయంలో ఏ మార్పు ఉండబోదట ?

Published on Feb 11, 2023 2:46 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB 28. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ వారు దీనిని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ఈ నెల మూడవ వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే విషయం ఏమిటంటే, అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఆగష్టు 11 న విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలియచేసారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ రిలీజ్ డేట్ లో ఏమాత్రం మార్పు ఉండబోదని తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కడి నుండి తిరిగివచ్చిన అనంతరం నిరంతరాయంగా మూవీ షూట్ లో పాల్గొననున్నారట. మరోవైపు మూవీ షూట్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో పలు భారీ సెట్టింగ్స్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు