మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. ఆచార్య తర్వాత చేసే చిత్రం ఏమిటనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో ఉంది. ఐతే చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. సాహో చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.ప్రస్తుతం లూసిఫర్ స్క్రిప్ట్ కి సుజీత్ మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నాడు. అన్ని కుదిరితే లూసీఫర్ దసరా పండుగకి ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశాలున్నాయని తాజా సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
ఈ సినిమాలో నటులపై అనేక రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత విజయ శాంతి నటిస్తుందన్న వార్త కూడా స్ప్రెడ్ అయింది. అయితే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. తాజాగా ఓ కీలక పాత్ర కోసం నటి సుహాసినిని తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
