అక్కడ జరగనున్న నారాయణ్ దాస్ నారంగ్ గారి అంత్యక్రియలు.!

Published on Apr 19, 2022 11:31 am IST

ఈరోజు ఉదయమే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఊహించని వార్త వినాల్సి వచ్చింది. తెలుగు సినిమాకి చెందిన ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో కన్ను మూయడం తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర తీరని లోటుగా మారింది. అయితే ఇప్పుడు ఆయన అంతక్రియలకు సంబంధించి తాజా సమాచారం బయటికి వచ్చింది.

దీని ప్రకారం అయితే నారాయణ దాస్ నారంగ్ భౌతికాయాన్ని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని మ‌హా ప్రస్థానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలియ‌జేశారు. అలాగే ఈ కార్యక్రమానికి గాను అనేక మంది సినీ ప్రముఖులు హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :