“పొన్నియిన్ సెల్వన్” ఓపెనింగ్స్ అక్కడ భారీగా ఉంటాయా?

Published on Sep 29, 2022 2:01 am IST


ప్రస్తుతం తమిళ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్” కోసం అందరికీ తెలిసిందే. విలక్షణ హీరో విక్రమ్ అలాగే కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్ సహా తదితర బిగ్ స్టార్స్ కలయికలో ఇండియాస్ లెజెండరీ ఫిలిం మేకర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం భారీ పీరియాడిక్ చిత్రంగా రాబోతుంది.

అయితే ఈ చిత్రానికి మన తెలుగులో కాస్త తక్కువ బజ్ తోనే ఉంది కానీ తమిళ్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో అయితే ఈ చిత్రానికి మంచి వసూళ్లే నమోదు అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే తమిళ్ సహా ఓవర్సీస్ తమిళ్ వెర్షన్ లోనే భారీ బుకింగ్స్ నమోదు అవుతున్నాయట దీనితో అయితే తమిళ్ వెర్షన్ వరకు మాత్రం పొన్నియిన్ సెల్వన్ కి మంచి ఓపెనింగ్స్ నే దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మరి ఈ చిత్రానికి ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :