తెలుగులో రాశీఖన్నా ఫేవరెట్ స్టార్స్ ఎవరంటే..

Published on Oct 5, 2021 4:23 pm IST

తమ కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోస్ తో మంచి ఛాన్స్ లు కొట్టేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో రాశీ ఖన్నా కూడా ఒకరు. ఇప్పుడు పలు సాలిడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ గ్లామరస్ హీరోయిన్ లేటెస్ట్ గా తన ఇన్స్టా ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. మరి ఈ సెషన్లో రాశీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం అని అంతే కాకుండా తనతో వర్క్ చెయ్యాలని కూడా ఉందని తెలిపింది.

అలాగే హీరోస్ లో అయితే అందరూ ఇష్టమే అని కానీ పర్సనల్ గా అయితే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సూపర్ స్టార్ మహేష్ బాబు లు తన ఫేవరెట్ అని తాను తెలిపింది. ఇక హీరోయిన్స్ లో అయితే సమంతా అలాగే అనుష్క శెట్టి లు తనకి చాలా ఇష్టం అని రాశీ తెలిపింది. ప్రస్తుతానికి అయితే తాను తెలుగు మరియు తమిళ్ సినిమాల్లో బిజీగా బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :